Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2016 13:40:09
facebook Twitter Googleplus
Photo

మొన్నటిదాకా సుప్రీమ్ హీరో అంటే చిరంజీవే. ఇకపై ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గుర్తుకొస్తాడేమో. సుప్రీమ్ పేరుతో సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో రాశిఖన్నా కథానాయిక. సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. మేలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకోసం నిర్మాత దిల్రాజు భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సేల్ ఫర్ సుబ్రమణ్యంలాంటి హిట్టు తర్వాత సాయిధరమ్ తేజ్ చేస్తున్న సినిమా కావడం పటాస్ లాంటి హిట్టు తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా ఇదే కావడంతో సుప్రీమ్ పై భారీ అంచనాలున్నాయి.

అందుకు తగ్గట్టుగానే దిల్ రాజు సినిమాని రిచ్ గా తీస్తున్నాడు. ఈ సినిమాలో సుప్రీమ్ హీరో అంటూ సాగే చిరంజీవి పాటని కూడా రీమిక్స్ చేసి వినిపిస్తున్నారు. ఆ పాటకి సంబంధించిన స్టిల్ ని రాశిఖన్నా తాజాగా బయటపెట్టింది. ఇక్కడున్న ఆ స్టిల్ ని చూస్తుంటే సినిమాని ఏ రేంజ్ సెటప్ లో తీశారో అర్థమవుతోంది. నా హార్ట్ కి బాగా దగ్గరైన సినిమా సుప్రీమ్ అని ఆ సినిమా విడుదల గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని రాశిఖన్నా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఆమె ఈ సినిమాలో పోలీసు పాత్రలో నటించింది. సాయిధరమ్ తేజ్ కార్ డ్రైవర్ పాత్రలో నటించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయిధరమ్ తేజ్ సినీ ప్రయాణానికి ఈ సినిమా కీలకం అని చెప్పొచ్చు.

,  ,  ,  ,  ,  ,