Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:57:30
facebook Twitter Googleplus
Photo

కొన్ని యాంగిల్స్ లో చూసినంతనే శ్రియ శరణ్ లా కూసింత అనిపించేలా ఉంటుంది పూర్ణ. అలా అని అమ్మడ్ని చూస్తే అలాంటివి అస్సలు కనిపించవు. మురిపించే అందంతో అప్పుడప్పుడు దక్కే అవకాశాలతో తన సత్తా చాటాలన్న తపన పూర్ణకు ఎక్కువే. కాకుంటే.. ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. ఆ లోటును తాజాగా విడుదలైన జయమ్ము నిశ్చయమ్మురా తీరుస్తుందనే చెప్పాలి. ఆ సినిమాలో పూర్ణ కంటే కూడా ఆమె నటించిన ??రాణి?? క్యారెక్టర్ కుర్రాళ్లను విపరీతంగా డిస్ట్రబ్ చేస్తోంది. అమ్మాయి అంటే రాణిలా ఉండాలని ఫిక్స్ అయిపోతున్నారట.

రీల్ కు రియల్ కు తేడా ఉంటుందన్నవిషయాన్ని మర్చిపోయిన మరీ.. పూర్ణ చూపించిన ?రాణి?ని చూసి ప్లాట్ అయిపోయి.. ఆమెను అలానే ఊహించుకొని ప్రపోజల్స్ కూడావచ్చేస్తున్నాయట. అయితే.. అమ్మడు విషయాలు మొత్తం కానీ తెలిస్తే షాక్ తినాల్సిందే అంటూ పూర్ణ ముచ్చట్లను చెప్పుకొచ్చాడు.. ఆ సినిమా హీరో శ్రీనివాసరెడ్డి.

సినిమా ప్రమోషన్లో భాగంగా ఛానళ్లకు వెళ్లి సరదాగా ముచ్చట్లు చెప్పే క్రమంలో పూర్ణ గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పారు. సినిమాలో ఆమె పోషించిన రాణి పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని.. ఆమెను వాళ్ల నాన్నగారు సినిమాలో క్యారెక్టర్ మాదిరి ?రాణి?లా పెంచాలనుకున్నా.. రియల్ గా పూర్ణ మాత్రం చాలా అల్లరి అమ్మాయిగా చెప్పారు.

రాణికి పువ్వులంటే చాలా ఇష్టమని.. ఎదుటోళ్ల చెవుల్లో పువ్వులు పెట్టటానికి ఇష్టమన్నారు. అంతలో కలుగజేసుకున్న పూర్ణ.. ??పూర్ణకు ఫుడ్ అంటే ఇష్టం?? అని చెప్పినంతనే ఆమె.. ఫుడ్ ను ఎంతగా ప్రేమిస్తుందో చెప్పి నవ్వుల్లో ముంచెత్తారు. సెట్లోకి వచ్చేటప్పుడు అవీ ఇవీ తింటూ వచ్చేదని.. మేకప్ మెన్ సర్ది చెప్పేవారంటూ ఆమె ఫుడ్ ను ఎంతగా ఇష్టపడుతుందో చెప్పుకొచ్చారు.

షూటింగ్ లో భాగంగా భీమిలికి వెళ్లిన టైంలో పూర్ణకు మంగ అనే కుక్ ఉండేదని..ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని.. ఆ రోజు చేసే మెనూ గురించి అడిగి తెలుసుకునేది. పీతలు చేయనా? అని అడిగితే.. పీతలా? వాట్ అంటూ తనను అడిగేదని.. అది కూడా ఒకరకం చేపలాంటివేనని చెప్పేవాడినని చెప్పారు. గ్లామర్ కు ఎక్కడ దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో హీరోయిన్లు నోరు కట్టేసుకోవటం తెలిసిందే. కానీ.. పూర్ణ మాత్రం అందుకు చాలాభిన్నమన్న మాట. అంత ఫుడ్ లాగిస్తూ.. గ్లామర్ మెయింటైన్ చేస్తున్న పూర్ణను మెచ్చుకోవాల్సిందే.

,  ,  ,  ,  ,  ,