Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 15:56:34
facebook Twitter Googleplus
Photo

డ్యాన్స్ విషయం ఎత్తితే తనకు వణుకు వచ్చేస్తుందని అంటుంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తానో చెత్త డ్యాన్సర్ అని.. డ్యాన్స్ చేయడం అన్నది నరకప్రాయం అని కూడా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. కానీ ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమాలో డ్యాన్సులవీ బాగానే చేశాడు. ఈ స్టెప్పులకు మంచి కాంప్లిమెంట్లు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా చిరు చేసిన వీణ స్టెప్పును పవన్ బాగానే అనుకరించాడని అంటున్నారు. ఐతే ఆ స్టెప్పు తనకు తోచినట్లు చేశానని.. ఏదో అలా మేనేజ్ చేశానని అంటున్నాడు పవన్.

??అన్నయ్య వీణ స్టెప్పు.. నేను చేసిన స్టెప్పు పోల్చి చూడండి. చాలా తేడా ఉంటుంది. ఆయన కింది నుంచి ఐదు అంచెలు లేచి పైకి వస్తాడు. కానీ నేను ఒకే ఒక అంచెలో చేశా. ఏదో నాకు తోచినట్లు ఆ డ్యాన్స్ చేసేశా. బేసిగ్గా నేను మంచి డ్యాన్సర్ కాదు. మ్యూజికల్ సెన్స్ ఉంది కానీ.. డ్యాన్సింగ్ ఎబిలిటీ లేదు. ఒక స్టెప్పు వేయమని అనగానే కుచించుకుని పోతుంటాడు. ముఖ్యంగా రోడ్డు మీద డ్యాన్స్ అంటే వణుకు వచ్చేస్తుంది. అదే ఫారిన్లో అయితే కొంచెం ధైర్యం వస్తుంది. ఏదో నాకు వచ్చిన డ్యాన్స్ చేసేస్తాను. నా దగ్గర ఏడో ఎనిమిదో స్టెప్పులుంటాయి. వాటిలో సందర్భానికి సరిపోయే ఏదో ఒక స్టెప్పు వేసేసి మేనేజ్ చేస్తుంటా. అంతకు మించి మాత్రం నా వల్ల కాదు. డ్యాన్స్ చేయడం అన్నది నరకప్రాయం?? అని పవన్ చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,