Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2017 14:44:25
facebook Twitter Googleplus
Photo

కొన్ని ఫెయిల్యూర్లు ఎదురైనా హర్రర్ కామెడీలపై ఇండస్ట్రీ జనాలకు ఇంకా ఆసక్తి తగ్గలేదు. తక్కువ బడ్జెట్.. భారీ తారాగణం అవసరం లేకపోవడం.. కొద్ది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసే అవకాశం వంటివి హర్రర్ కామెడీ సినిమాలు తీసేవారికి ఓ రకంగా ప్లస్ పాయింట్లు. తాజాగా మరో హర్రర్ కామెడీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. సాయికుమార్ తనయుడు ఆది - రష్మీ ప్రధాన పాత్రల్లో నెక్ట్స్ నువ్వే రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

తమిళంలో వచ్చిన యామిరుక్క భయమే సినిమాకు రీమేక్గా నెక్ట్స్ నువ్వే తెరకెక్కింది. ఈ మూవీ డైరెక్టర్ ప్రభాకర్ మొదట ఈ సినిమాను అల్లు శిరీష్ తో తీయాలని అనుకున్నాడట. ‘‘శిరీష్ కు కథ నచ్చినా.. హారర్ జానర్ వద్దని.. తరువాత వేరేదైనా ప్రాజెక్టు చేద్దామని చెప్పాడు. దాంతో అల్లు అరవింద్ ను కలిసి కథ వినిపించాను. ఆయన కొన్ని మార్పులు సూచించారు. అవి చేసి బన్నీ వాసును కలిసి కథ చెప్పాను. ఆయన ఓకే అనడంతో నెక్ట్స్ నువ్వే సినిమా రెడీ అయింది.’’ అని డైరెక్టర్ ప్రభాకర్ చెప్పారు. ఇది ఇంతవరకు వచ్చిన హర్రర్ కామెడీలాగా పూర్తిస్థాయి కామెడీ థ్రిల్లర్ కాదంటున్నాడు. కాసేపు నవ్విస్తూ.. కాసేపు భయపెట్టేలా ఉంటుందని చెప్పారు.

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా మారి చాలారోజులే అయినా సరైన హిట్ దొరకలేదు. దాంతో అవకాశాలు కూడా తగ్గాయి. ఇలాంటి టైంలో వస్తున్న నెక్ట్స్ నువ్వే మూవీపై ఆది బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో బ్రహ్మాజీ - రఘుబాబు కీలక పాత్రలు పోషించారు.

,  ,  ,  ,  ,