Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2017 10:54:30
facebook Twitter Googleplus
Photo

సినిమాతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందుకోసం ప్రభాస్ కూడా చాలా కష్టపడుతున్నాడు. సాహో సినిమా ద్వారా పూర్తి స్థాయి బాలీవుడ్ సినిమాతో రాబోతున్నాడు ప్రభాస్. అందుకోసం హిందీ కూడా బాగానే నేర్చుకుంటున్నాడు. అయితే ఆయనపై పై వస్తున్న కొన్ని రూమర్స్ పై రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

ప్రభాస్ మాట్లాడుతూ.. ఒక హీరోయిన్ తో సాధారణంగా రెండు మూడు సినిమాలు నటిస్తే..ఆమెతో రిలేషన్ ఉందని రూమర్స్ రావడం ఈ రోజుల్లో కామన్. అలాగే అనుష్క కి నాకు మధ్య రిలేషన్ ఉందని రూమర్స్ వచ్చాయి. అసలు మా మధ్య ఎలాంటిది ఏమి లేదు. గత తొమ్మిదేళ్ల నుంచి మేము మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటున్నాం. ఒకరికి గురించి ఒకరికి బాగా తెలుసు. అయితే రూమర్స్ వచ్చినప్పుడు తమ ఇద్దరి మధ్య నిజంగా ఏమైనా ఉందా? అని డౌట్ వస్తుందని ప్రభాస్ నవ్వుతూ చెప్పాడు.

ఇక పెళ్లి గురించి ప్రస్తావన రాగానే. తన వ్యక్తి గత జీవితాన్ని బయటపెట్టుకోవడం నాకు అంతగా నచ్చదు. కానీ పెళ్లి చేసుకుంటే అందరికి తెలిసేలా చేసుకుంటానని చెప్పాడు.

,  ,  ,  ,