Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2016 14:36:55
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మురుగదాస్ తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. అందుకే ఆ రెండు నేటివిటీలకు తగ్గట్టు నటీనటులను ఎంచుకున్నారు మురుగదాస్. అందులో భాగంగానే తమిళ స్టార్ కమెడియన్, నటుడు ఆర్జే బాలాజిని ఈ చిత్రంలోని ఓ ముఖ్య పాత్ర కోసం ఎంచుకున్నారు మురుగదాస్.
ఈ విషయంపై స్వయంగా నటుడు ఆర్జే బాలాజి మాట్లాడుతూ ?నేను పనిచేయాలనుకున్న దర్శకుల్లో ఒకరు మురుగదాస్. ప్రస్తుతం మహేష్ బాబుతో ఆయా చేస్తున్న సినిమాలో ఆకు మంచి పాత్ర దక్కింది. సినిమాలో నేను మహేష్ ఫ్రెండ్ గా కనిపిస్తాను. ఒత్తి కమెడియన్ గానే కాక మహేష్ పై నడిచే ముఖ్యమైన సన్నివేశాల్లో నేనుంటాను. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. త్వరలోనే షూటింగ్ లో జాయినవుతాను? అన్నారు.

,  ,  ,  ,  ,