Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 15:26:17
facebook Twitter Googleplus
Photo

క్రేజీ కాంబినేషన్లు చాలా అరుదుగా వర్కవుట్ అవుతుంటాయి. తాజాగా అలాంటి కాంబినేషన్ మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలీవుడ్ ఇప్పటికే తనదైన మార్క్ ను వేసేసి.. భారీ కలెక్షన్ల హీరోగా పేరు సంపాదించుకున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడైన సల్మాన్ నుంచి సినిమా వస్తుందంటే.. బాక్స్ ఆఫీస్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది.

తన సినిమాతో వందల కోట్లను కొల్లగొట్టే సల్మాన్ తో.. వేల కోట్లు కొల్లగొట్టిన బాహుబలి చేతులు కలిపితే ఎలా ఉంటుంది? ఊహించటానికే ఎంతో గ్రాండ్ గా ఉన్న ఈ కాంబినేషన్ మీద ఇప్పుడు బాలీవుడ్ లోనూ.. టాలీవుడ్ లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సల్మాన్ ఖాన్.. ప్రభాస్ లు కలిసి ఒక సినిమా చేస్తున్నట్లుగా ఇప్పుడో వార్త ఇప్పుడు హడావుడి చేస్తోంది.

ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ వర్కవుట్ అయ్యేటట్లు ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. వీరిద్దరి కాంబనేషన్ ఒక సంచలనం క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. ఇద్దరు ఫుల్ ఫాంలో ఉన్న హీరోలతో కలిసి తీసే మల్టీస్టారర్ సినిమాకు నిర్మాత ఎవరన్న ప్రశ్నతో పాటు.. మరీ సినిమా బడ్జెట్ ఎంత అవుతుందన్న లెక్కల్ని వేయటంలో పలువురు బిజీబిజీగా ఉంటున్నారు.

,  ,  ,  ,  ,