Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2017 11:28:09
facebook Twitter Googleplus
Photo

రేపటి సూపర్ స్టార్.. ఈమాట అన్నది ఎవరో మామూలు వ్యక్తి కాదు. బాహుబలి సినిమాతో భారత దేశమంతటా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్న ప్రభాస్. శర్వానంద్ లేటెస్ట్ మూవీ మహానుభావుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రభాస్ శర్వానంద్ పై ప్రశంసల జల్లు కురిపించేశాడు. హాయ్ డార్లింగ్స్ అంటూ తనదయిన స్టయిల్ లో అభిమానులను పలకరించడంతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ విషయం మాట్లాడొచ్చో.. మాట్లాడకూడదో తెలియదంటూనే బోలెడు కొత్త విషయాలు చెప్పుకొచ్చాడు.

‘మహానుభావుడు టీజర్ మీ అందరికీ నచ్చిందనుకుంటాను. శర్వా మా ఇంటి హీరో. రన్ రాజా రన్ సినిమాకు హీరోగా ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు వంశీ అతడి పేరు చెప్పాడు. అంతకుముందు ఎంటర్ టెయిన్ క్యారెక్టర్ చేయలేదు కదా అని డౌట్ పడినా తర్వాత అతడి నటన చూసి అందరం అతడి ఫ్యాన్స్ అయిపోయాం. అతడి యాటిట్యూడ్ నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ఆ రోజు నుంచి శర్వా నాకు బ్రదరైపోయాడు. మహానుభావుడు సినిమా కెప్టెన్ మారుతి తీసిన ప్రేమకథా చిత్రమ్ చూసి పడిపడి నవ్వాను. ఇంత నవ్వించడం అంటే మామూలు విషయం కాదు. ప్రేమకథా చిత్రమ్ - భలేభలే మగాడివోయ్ సినిమాలను మించి మహానుభావుడు ఉండాలని కోరుకుంటున్నా. సినిమా టీం అందరికీ అభినందనలు’ అంటూ తన మాటలతో అందరినీ మురిపించాడు ప్రభాస్.

మహానుభావుడు సినిమాలో శర్వానంద్ అతి శుభ్రత పాటిస్తూ అందరినీ విసిగించే పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రభాస్ ముందుగా శర్వానంద్ కోసం ఓ గిఫ్ట్ పట్టుకొచ్చాడు. అదేంటంటే డెట్టాల్ - శానిటైజర్ - మాస్క్ - గ్లౌజ్ వంటివన్నీ ఓ బాక్స్ లో వేసి తీసుకొచ్చాడు. వాటిని చూసి ఇవన్నీ సినిమాలోనే వాడనంటూ శర్వా అంటే బయట నువ్వు డర్టీయా అంటే ప్రభాస్ ఫన్నీగా అడిగాడు.

,  ,  ,  ,  ,  ,