Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2017 12:39:01
facebook Twitter Googleplus
Photo

కొందరికి కొన్నిసార్లు కలిసి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు ప్రభాస్కు బాహుబలిలో డూప్ గా నటించిన కిరణ్ రాజ్. బాహుబలి 2 తో ప్రభాస్ కు వచ్చిన భారీ ఇమేజ్ నేపథ్యంలో.. డార్లింగ్ కు డూప్ గా నటించి.. ప్రభాస్ ఫీచర్లతో కనిపించే కిరణ్ రాజ్ తో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు మల్లిఖార్జునరెడ్డి.. మొహమ్మద్ జాఫర్ అలీలు సంయుక్తంగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి కిరణ్ కోటప్రోలు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఫిలింనగర్ లో తాజాగా జరిగింది. ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుందని చెబుతన్నారు దర్శకుడు కిరణ్. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆడియన్స్ను మెప్పించటం ఖాయమని చెబుతున్నారు. మిగిలిన తారాగణం వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఈ మూవీలో కథ ప్రకారం.. ప్రభాస్ డూప్ గా పని చేసిన కిరణ్ సరిగ్గా సరిపోతాడనిపించిందని.. అందుకే ఆయన్ను ఎంపిక చేసినట్లుగా చెప్పారు.

ఇక.. ఈ చిత్ర హీరో బాహుబలి కిరణ్ రాజ్ మాట్లాడుతూ.. తాను ముందుగా బాహుబలి గురించి మాట్లాడాలని.. ఆ సినిమా తమకు ఒక యూనివర్సిటీగా అభివర్ణించారు. వల్లీ మేడమ్ దగ్గర క్రమశిక్షణ.. రమా మేడమ్ దగ్గర మంచితనం.. రాజమౌళి దగ్గర కష్టపడే తత్త్వాన్ని నేర్చుకున్నానని.. ఎంత ఎదిగినా ఒదిగినట్లుగా ఉండే వైనాన్ని హీరో ప్రభాస్ వద్ద నేర్చుకున్నానంటూ తన విధేయతను ప్రదర్శించారు.

,  ,  ,  ,  ,