Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Oct-2016 10:55:48
facebook Twitter Googleplus
Photo

ఏమాటకామాట చెప్పుకోవాలంటే... బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. ఇక రాబోయే బాహుబలి - 2 పై అంచనాలు కూడా ఎక్కడో ఉన్నాయి. కచ్చితంగా బాహుబలి - 2 తర్వాత ప్రభాస్ సముద్రం లాంటి సినిమాలే తీస్తాడు తప్ప ఇక చిన్నచిన్న నదులు - పిల్లకాలవల సినిమాలు తీయడని ఇప్పటికే సంకేతాలు వచ్చేసాయి. ఈ క్రమంలో ఈసారి ప్రభాస్ స్థాయిని ఆకాశంలోకి తీసుకుపోవాలని అనుకుంటున్నారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు.

ఆకాశంలోకి తీసుకుపోవడం అంటే... ఏవేవో ఊహించుకునేరు... అలా ఏమీ కాదు కానీ ఒక ఫైట్ ని ఆకాశంలో చిత్రీకరించాలనుకుంటున్నారట. మీరు చదివింది నిజమే... బాహుబలి తర్వాత సుజీత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోయే యాక్షన్ సినిమాలో ఒక ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్ మొత్తం ఆకాశంలోనే జరుగుతుందట. ఈ భారీ ఫైట్ కోసం దాదాపు ముప్పయ్ కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసారట. దీని కోసం హాలీవుడ్ చిత్రాలకి పని చేసిన స్టంట్ మాస్టర్ ని ఇప్పటికే హైర్ చేసుకున్నారని టాక్. మొదట్లో ఈ సినిమాని యాభై కోట్ల పెట్టుబడిలో చేద్దామని అనుకున్న ఇప్పుడు అదికాస్త నూట యాభై కోట్లకు చేరిందట. అయినా కూడా ఏమాత్రం వెనకాడకుండా సినిమా తీయడానికి యువి క్రియేషన్స్ సిద్ధపడుతోందని సమాచారం.

బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ తమిళం మలయాళం వీలైతే ఇంగ్లిష్ లోనూ విడుదల చేసుకోవడానికి ఆస్కారముందని నిర్మాతలు భావిస్తున్నట్లున్నారు. ఆస్థాయి అవకాశం ఉన్నప్పుడు ఈమాత్రం ఖర్చుకి వెనకాడడం దేనికని అంత ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సరేనన్నారట. దాంతో "ఆకాశంలో ఫైట్" అనే అంశం తెరపైకి రావడం ఆ ఫైట్ తీయాలనే సుజీత్ కల తీరిపోనుండటం జరగబోతుందన్నమాట. ఏది ఏమైనా... 30 కోట్లు ఒకే ఒక్క ఫైట్ సీన్ మీద పెట్టబోతున్నారంటే... మాటలు లేవు ఇంక తెరపైన చూసే వరకూ అభిమానుల ఊహకు హద్దులు కూడా లేవు!!

,  ,  ,  ,  ,