Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 13:47:57
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ హీరో ప్రభాస్.. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు. బాహుబలి మేనియా నుంచి ఇంకా జనాలు పూర్తిగా బయటకు కూడా రాలేదు. అంతటి బాహుబలికి తెలియని విషయాలు.. ఆ సినిమా కోసం చేయని పాట్లు.. ఫీట్లు లేవు. అంతగా కష్టపడబట్టే.. బాహుబలి సిరీస్ లో అంత దేహధారుడ్యాన్ని చూపగలిగాడు ప్రభాస్. మరి అలాంటి బాహుబలి పాత్రధారి ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏముంటుంది.. ఇంకా ఏం బ్యాలెన్స్ మిగిలింది అనుకోవచ్చు.

అయితే.. నేర్చుకునేందుకు ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం ఉంటూనే ఉంటుంది. కొత్త సినిమాల్లో కొత్త అంశాలు చూపించి అభిమానులను అలరించేందుకు స్టార్ హీరోలు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందులో భాగంగానే.. తన కొత్త సినిమా సాహోలో తెలుగు తెరకు ఓ కొత్త యాక్షన్ ఎడ్వంచర్ చూపించనున్నాడట ప్రభాస్. ఈ సినిమాలో నీటి అడుగున జరిగేలా ఓ కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్ ను డిజైన్ చేశారట. ఇందుకోసమే ప్రభాస్ స్కూబా డైవింగ్ నేర్చేసుకున్నాడట. నీటి అడుగునే చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్.. సినిమాకి హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలున్నాయి.

సాహో మూవీలో ఇలాంటి యాక్షన్ థ్రిల్స్ చాలానే ఉంటాయని తెలుస్తోంది. వీటికోసం పూర్తిగా ప్రిపేర్ అయ్యేందుకే.. షూటింగ్ ప్రారంభానికి ఇంత ఆలస్యం జరిగిందట. ఇక సాహో చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది.

,  ,  ,  ,  ,