Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2017 12:25:15
facebook Twitter Googleplus
Photo

దాదాపు 4 ఏళ్ళ నుండి ఇదే ఫీలింగ్ లో ఉన్నాను. అప్పటికే ఓ రెండేళ్ళ ముందు బాహుబలి లైన్ చెప్పాడు రాజమౌళి. ఆయనతో ఇంత పెద్ద సినిమా చేస్తున్నాం అంటే.. వర్కవుట్ అయితే అందరి జీవితాలు మారిపోతాయ్. బాహుబలి గురించి అదే అనుకున్నా. అదే జరిగింది అంటున్నాడు బాహుబలి ప్రభాస్. పైగా ప్రొడ్యూసర్ తల తాకట్టుపెట్టి ఈ సినిమాను తీశారు. అంత రిస్క్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే అందరూ పాజిటివ్ గా పనిచేసి ఈ సినిమాకు పనిచేశారు. అందుకే ఈ రేంజ్ సక్సెస్ అయ్యుంటుంది అంటున్నాడు ఈ కండలవీరుడు.

ఇక రాజమౌళితో ఫ్రెండ్ షిప్ గురించి చెబుతూ.. రోజూ పక్కనే ఫ్రెండుకు.. పది రోజులకు ఒక్కసారి వచ్చే ఫ్రెండుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. రాజమౌళి చాలా క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఆయన ఎవ్రీడే ఒక బెటర్ పర్సన్ గా మారిపోతున్నారు. అదే నా పర్సనల్ ఒపీనియన్'' అన్నాడు. ఇక తనకు పాపులార్టీ ఎంత వచ్చిందో తెలియదు కాని.. ఢిల్లీలో ముంబయ్ లో ఎయిర్ పోర్టులో కూడా జనాలు అందరూ తనతో ఫోటోలు దిగుతున్నారు.. గుర్తుపడుతున్నారు.. అంటున్నాడు ప్రభాస్. ''బాహుబలి వంటి సక్సెస్ వచ్చాక ఆటోమ్యాటిక్ గా ఇలాంటి హైప్ తో కూడిన రిజల్టు ఉంటుంది. అందుకుని వాటిని సీరియస్ గా తీసుకోకూడదు. తదుపరి సినిమా ఏంటనేదే చూసుకుంటా అన్నాడు. అలాగే బాలీవుడ్లో సినిమాను చేయాలి అంటే హిందీ బాగా రావాలి కాబట్టి.. ఖచ్చితంగా నేర్చుకుంటాను అంటున్నాడు.

ఇప్పటివరకు చాలామంది కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి.. పార్ట్ 3 లో ఆ విషయం మీకు తెలుస్తుంది అంటూ ఎవరితోనో జోకేశాడు. ఇకపోతే మొదటి భాగం కంటే 2వ భాగంలోని పాటలు చాలా బాగున్నాయట. అలా అంటూ ముగించాడు ప్రభాస్.

,  ,  ,  ,