Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 10:43:18
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడురా పెళ్లి.. అనే ఈ పాట నా గురించే రాసినట్టుంది. పాటలో సాహిత్యం, ట్యూన్ క్యాచీగా ఉన్నాయి. ఈ పాటతో పాటు సినిమా కూడా విజయం సాధించాలి అన్నారు ప్రభాస్. దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా నటించిన సినిమా అరకు రోడ్‌లో. వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, నక్కా రామేశ్వరి నిర్మించారు.

?బాహుబలి? లొకేషన్‌లో ఈ సినిమా సాంగ్ టీజర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ - ??ప్రభాస్‌గారు పాటను మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 10న ఆడియో విడుదల చేస్తున్నాం. రోడ్ థ్రిల్లర్ మూవీ ఇది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం?? అన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, పృథ్వీ, కృష్ణభగవాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, కెమేరా: జగదీశ్ చీకటి, మ్యూజిక్: వాసుదేవ్, రాహుల్‌రాజ్.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,