Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2017 10:05:25
facebook Twitter Googleplus
Photo

యువ కథానాయకుడు నాని ఇప్పుడు ఉత్త నాని కాదు. అతడి పేరు ముందు నేచురల్ స్టార్ అనే బిరుదుంది. గత రెండేళ్లలో ఇంతింతై అని ఎదిగిపోతూ.. తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు నాని. ఇప్పుడు నానికి ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల దాకా పారితోషకం అందుతోంది. అతడి సినిమాలకు నిలకడగా రూ.25 కోట్ల దాకా బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి మూడు సినిమాల దాకా చేస్తూ యమ ఊపుమీదున్నాడు నాని. అలాంటపుడు నాని కుటుంబ సభ్యులు ఎంత విలాసంగా అయినా బతకొచ్చు. కానీ నాని తల్లి మాత్రం ఇప్పటికి ఉద్యోగం చేస్తోందట. ఆమె రోజూ బస్సులోనే ఆఫీసుకు వెళ్తుందట. ఈ విషయాన్ని నానీనే స్వయంగా వెల్లడించాడు.

తన తల్లి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని.. ఇప్పుడు ఆమె పని చేయాల్సిన అవసరం లేదని.. ఉద్యోగం వదిలేయమంటే వదలడం లేదని నాని చెప్పాడు. రోజూ ఆర్టీసీ బస్సులోనే ఆఫీసుకు వెళ్తుందని.. ఎప్పుడైనా తాను షూటింగ్ నుంచి ఇంటికి తొందరగా వచ్చి అమ్మేదీ అని అడిగితే.. ఆఫీసుకు వెళ్లిందని చెబుతారని.. ఫోన్ చేసి ఆఫీసుకు ఎలా వెళ్లావని అడిగితే.. ఇంటి నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న బస్టాపుకు నడిచి వెళ్లానని.. బస్సులోనే ఆఫీసుకు చేరుకున్నానని చెబుతుందని నాని తెలిపాడు. ఆఫీసుకు వెళ్లి అక్కడి ఫార్మసీలో కౌంటర్ ఓపెన్ చేసి.. అక్కడికొచ్చే వృద్ధులతో మాట్లాడి వాళ్లకు మందులు ఇవ్వకపోతే తన తల్లికి రోజు గడవదని నాని చెప్పాడు. మా ఆఫీసులో పని చేసే చాలామంది నీ ఫ్యాన్సే అంటూ ఆమె చాలా ఆనందంగా చెప్పుకుంటుందని నాని తెలిపాడు.

,  ,  ,  ,