బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ సుజిత్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లని టాలీవుడ్ ఓ వార్త సందడి చేస్తున్నది. రాజమౌళి వంటి దర్శకుడికే 100 కోట్లతో సినిమా చేయడం చాలా టైం పట్టేసింది, అటువంటిది సుజిత్ రెండో సినిమాతోనే ఎలా సాధ్యమని సోషల్ మీడియాలోనూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి మార్కెట్ ని కంటిన్యూ చేయాలంటే ఆమాత్రం ఖర్చు పెట్టాల్సిందే అని యువి క్రియేషన్స్ ఆలోచనట. ఇటీవల టాలీవుడ్ లో వందకోట్ల బడ్జెట్ మాములు విషయంగా మారింది. మరి సుజిత్ ఈ భారీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయగలడా? అనేది సందేహంగా మారింది.
Prabhas, Next, Movie, budjet, Matter, Tollywood,