కోట్లు ఇంటికి నడిచొస్తాయంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి.. కానీ కొందరు స్టార్ హీరోలు మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా ఉంటారు. కోట్లు కుమ్మరిస్తామని వెంటపడుతున్నా ఏ మాత్రం లెక్క చేయరు. డబ్బులపై ఆశ లేకపోవడం ఒక కారణమైతే.. డీల్ కుదరకపోవడం మరో కారణం అవుతూ ఉంటుంది.
ఇప్పుడు ప్రభాస్ ఏకంగా 18 కోట్ల రూపాయల డీల్ ను కాదన్నాడనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది. ఓ యాడ్ కంపెనీ ఆఫర్ చేసిన మొత్తాన్ని వద్దని చెప్పి అమెరికా వెళ్లిపోయాడట. ఒక ప్రకటనకు ఇంత మొత్తం అంటే భారీ అమౌంట్ అనాల్సిందే. అయినా సరే వద్దని చెప్పడంలో ప్రభాస్ ఆంతర్యం అంతు పట్టడం లేదు. నిజానికి బాహుబలి2 తర్వాత బోలెడన్ని అండార్స్ మెంట్స్ ప్రభాస్ చెంతకు చేరుతున్నాయి. వీటిలో కొన్నిటికి ఇప్పటికే ప్రభాస్ సైన్ చేశాడట కూడా. అమెరికా టూర్ నుంచి వచ్చాక వీటి షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.
ఇప్పటికే నాలుగైదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. వీటిలో ఓ ఫోర్ వీలర్ కంపెనీ.. పెర్ఫ్యూమ్ కంపెనీ ఉన్నాయని అంటున్నారు.