Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2017 13:35:57
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు సినిమాల్లో గ్రాఫిక్స్ కు ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. కేవలం గ్రాఫిక్స్ నే ఆయుధంగా చేసుకుని గ్రాండ్ సక్సెస్ సాధించచ్చని ప్రూవ్ చేశాడు రాజమౌళి. అప్పట్లో మగధీర అయినా.. తాజాగా బాహుబలి అయినా.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవడంలో గ్రాఫిక్స్ పోషించిన పాత్ర కూడా అపూర్వం.

బాహుబలిలో వాటర్ ఫాల్ సీన్ అయినా.. సుదీర్ఘంగా కొనసాగే యుద్ధ సన్నివేశం అయినా.. అంత అద్భుతంగా వచ్చాయంటే గ్రాఫిక్సే కారణం. అలాగని అన్ని సినిమాలను గ్రాఫిక్స్ కాపాడేస్తాయని చెప్పలేం. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన పులి మూవీ విషయంలో.. ఈ గ్రాఫిక్స్ ఏం హెల్ప్ చేయలేకపోయాయి సరికదా.. ఇంకా చెడు చేశాయని చెప్పాలి. ఇలాంటిదే మరో ఎగ్జాంపుల్ నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రంలో కూడా గ్రాఫిక్స్ ను బాగానే ఉపయోగించారు. గోపురం.. మాడ వీధులను నిజంగానే నిర్మించినా.. తిరుమలను తలపించేలా చేయడం మాత్రం గ్రాఫిక్స్ మహిమే. అయితే.. సినిమా కలెక్షన్స్ మాత్రం నిరుత్సాహపరుస్తున్నాయి.

ఇప్పుడు రానా నటిస్తున్న ఘాజీ మూవీకి కూడా.. గ్రాఫిక్స్ ప్రాణం పోయాల్సి ఉంటుంది. ఇందులో 700 సీజీ షాట్స్ వాడామని ఇప్పటికే చెప్పాడు దర్శకుడు. గ్రాఫిక్స్ బోలెడన్ని ఉన్నంత మాత్రాన.. ఆ చిత్రం అద్భుతంగా ఆడేస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఘాజీ విషయంలో గ్రాఫిక్స్ ఎలాంటి హెల్ప్ చేయనున్నాయో తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయక తప్పదు.

,  ,  ,  ,  ,