Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2017 10:04:06
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 సాధించిన ఘనవిజయం ప్రభావంతో ప్రభాస్ ఇప్పుడు నేషనల్ లెవెల్ హీరో అయిపోయాడు. యంగ్ రెబల్ స్టార్ కి వచ్చే మూవీ ప్రపోజల్స్ అన్నీ పలు భాషల్లో విడుదల చేసేందుకు వీలుగానే ఉంటున్నాయి. ఊహించిన దాని కంటే అధికంగా క్రేజ్ వచ్చేసినా.. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం సుజిత్ దర్శకత్వంలో సాహో చేసేందుకే సిద్ధమయ్యాడు ప్రభాస్.

బాహుబలి2 రిలీజ్ కంటే ముందే టీజర్ కూడా రిలీజ్ చేయగా.. ప్రస్తుతం యూఎస్ లో రిలాక్స్ అవుతున్నాడు ప్రభాస్. ఇప్పుడీ సాహోపై వస్తున్న అప్ డేట్స్ అన్నిటినీ పరిశీలిస్తే.. పాతికేళ్ల క్రితం చరిత్ర సృష్టించిన రజినీకాంత్ బాషా మూవీని లేటెస్ట్ జనరేషన్ కి తగినట్లుగా మార్పులు చేసి తీస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ముంబైలోని కొన్ని లొకేషన్స్ ను సాహో యూనిట్ పిక్చరైజ్ చేస్తుండగా.. వర్షా కాలం ప్రారంభమయ్యాక అక్కడ ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని కీలకమైన సీన్స్ తీస్తారట. ఆ తర్వాత అబుదాబి వెళ్లనున్న యూనిట్.. అక్కడ సుదీర్ఘమైన షెడ్యూల్ పిక్చరైన్ చేయనున్నారు.

చివరగా యూరోప్ షెడ్యూల్ లో పాటలను చిత్రీకరించి సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తారని తెలుస్తోంది. ఈ లొకేషన్స్ ఎంపికను చూస్తే.. ముంబైలో ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అబుదాబిలో మారుపేరుతో ఉండే హీరో.. విజువల్ ఎట్రాక్షన్ కోసం యూరోప్ లొకేషన్స్.. అంతా కలిపి ఈ జనరేషన్ బాషాగా ప్రభాస్ కనిపించనున్నాడనే టాక్ ఉంది.

,  ,  ,  ,  ,