Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 12:06:05
facebook Twitter Googleplus
Photo

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఒక విషయం చర్చనీయాంశం అవుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి-2 తర్వాత సుజీత్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాలో ఒక ఫైట్ కోసం ఏకంగా రూ.30 కోట్లకు పైగా ఖర్చే చేయబోతున్నారన్న వార్త హాట్ టాపిక్ అయింది. రూ.30 కోట్లుంటే ఒక పెద్ద బడ్జెట్ సినిమానే తీసేయొచ్చంటే.. ఒక ఫైట్ కోసమే అంత ఖర్చు చేయడం ఏమిటా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇది గాల్లో హెలికాఫ్టర్ల మధ్య చిత్రీకరించే ఫైట్ అని.. అందుకే అంత ఖర్చు అని చెబుతున్నప్పటికీ మరీ రూ.30 కోట్లు పెట్టేస్తారా అని సందేహిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఐతే ఈ సినిమాకు అంత ఖర్చవడానికి వేరే కారణం ఉంది. ఈ ఎయిర్ ఫైట్ ను కంపోజ్ చేసేది మన యాక్షన్ కొరియోగ్రాఫర్ కాదు. ఈ ఫైట్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్ ను రప్పిస్తున్నారు. ఈ ఫైట్లో సగానికి సగం అతడి పారితోషకానికే పోతుందట. అతను బాగా కాస్ట్లీ అట. కొన్ని రోజులే పని చేసినా కోట్లల్లో పారితోషకం తీసుకుంటాడట. అందుకే ఈ ఫైట్ కు అంత ఖర్చవుతోందని సమాచారం. ఐతే సుజీత్-ప్రభాస్ చేయబోయేది జేమ్స్ బాండ్ తరహా సినిమా కావడం.. ప్రభాస్ సినిమా అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండటంతో.. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజిలో ఉండాల్సిందే అని ఫిక్సయ్యారట. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమాను ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించాలని నిర్ణయించారు. ప్రభాస్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది కాబట్టి.. బడ్జెట్ ఎక్కువైనా ఇబ్బంది లేదని భావిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఈ డిసెంబర్లోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుంది.

,  ,  ,  ,  ,