Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 15:06:24
facebook Twitter Googleplus
Photo

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉన్నాడు. బాహుబలి సిరీస్ కోసం.. ప్రభాస్ పడ్డ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందుకుంటున్నాడు. 2013 ఫిబ్రవరిలో మిర్చి తర్వాత.. ఇప్పటివరకూ బాహుబలి తప్ప మరే సినిమా ప్రభాస్ చేయలేదు. అంటే నాలుగేళ్ల కాలాన్ని ఒకటే ప్రాజెక్ట్ కోసం ఇచ్చేశాడు యంగ్ రెబల్ స్టార్.

బాహుబలి2 ట్రైలర్ రిలీజ్ తర్వాత.. ప్రభాస్ క్రేజ్ ఆకాశామే హద్దు అన్నట్లుగా పెరిగిపోయింది. టాలీవుడ్ లో పెద్ద బ్యానర్లతో పాటు.. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ప్రభాస్ కోసం క్యూ కట్టేస్తున్నాయి. అయితే.. ప్రభాస్ మాత్రం ప్రాజెక్టులు ఒప్పుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. తనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని అందరూ అంటున్నా.. సినిమాపై కూడా బోలెడంత ఖర్చు చేసి.. గ్రాండ్ లెవెల్ లో తీసేవారికే సినిమాలు చేయాలని చూస్తున్నాడట.

ప్రభాస్ స్నేహితులు ప్రారంభించిన యూవీ క్రియేషన్స్.. ప్రభాస్ నెక్ట్స్ మూవీని 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసేందుకు సిద్ధమైంది. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. అందుకే మరో 2-3 ఏళ్ల పాటు యూవీ బ్యానర్ కే సినిమాలు చేయనున్నాడట ప్రభాస్.

,  ,  ,  ,  ,