Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2017 15:44:32
facebook Twitter Googleplus
Photo

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ హంగామా మొదలైంది. బాహుబలి2 సక్సెస్ జోష్ లో ఉన్న ప్రభాస్.. ఓ చిన్నారిని ఎత్తుకున్న ఫోటో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ అయిపోతోంది. ఆ బిడ్డను బుల్లి ప్రభాస్.. అదేనండీ బుల్లి బాహుబలి అంటున్నారంతా.

బాహుబలి ది బిగినింగ్ లో రమ్యకృష్ణ చేతిలో ఉన్న బిడ్డను.. ఇప్పుడు ఎంతో ప్రేమగా ప్రభాస్ ఎత్తుకున్నాడని అంటున్నారు. అంటే.. చిన్నారి మహేంద్ర బాహుబలిని ప్రభాస్ ఎత్తుకున్నాడన్నది వారి వాదన. అయితే.. నిజానికి రమ్యకృష్ణ ఎత్తుకున్న బిడ్డ.. నిజానికి ఓ బొమ్మ మాత్రమే. రకరకాల గ్రాఫిక్ షాట్స్ ను చిత్రీకరించారంతే. కానీ క్లోజప్ షాట్స్ లో మాత్రం ఓ 18 రోజుల ఆడపిల్లపై చిత్రీకరించారు. అది ఎవరో కాదు.. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కుమార్తె అక్షిత. కేరళ షెడ్యూల్ లో ఉండగా ఈ షాట్ ను చిత్రీకరించారంతే.

అయితే.. ఇప్పుడు ప్రభాస్ ఎత్తుకున్న బిడ్డ ఆ చిన్నారి కాదు.. రీసెంట్ గా ప్రభాస్ ను కలిసేందుకు వచ్చిన ఫ్యాన్స్ లో ఒకరి చిన్నారిని ఎత్తుకుని ఫోటోలకు పోజులుచ్చాడు బాహుబలి.

,  ,  ,  ,  ,  ,