Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2015 11:00:17
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ తాజా బ్యూటీ రాశిఖన్నా జోరు మీదుంది. ఆమె అందచందాలకు ఫిదా అవుతున్న హీరోలు తమ సినిమాలకు ఆమెను రికమెండ్ చేస్తున్నారు. ఆ విధంగా, తాజాగా యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించే ఛాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మకి లభించింది. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి (సురేందర్ రెడ్డి వద్ద పనిచేశాడు) దర్శకత్వంలో రామ్ ఇప్పుడు 'శివం' పేరిట ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు రాశిఖన్నాను ఎంచుకున్నారు. త్వరలోనే ఆమె ఈ షూటింగులో జాయిన్ అవుతుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హేన్స్ నేతృత్వంలో యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.

,  ,  ,  ,