Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2015 14:17:32
facebook Twitter Googleplus
Photo

అనుకున్నట్టే జరిగింది. కంచెతో ఆకట్టుకున్న ప్రగ్యా స్టార్ హీరోతో జతకడుతోంది. తన తొలి చిత్రంతో అంతగా ప్రభావం చూపలేకపోయిన టాప్ మోడల్ ప్రగ్యా రెండో సినిమాతో మాత్రం సత్తా చాటింది. కంచెలో ఆమె నటనని చూసినవారంతా ఫిదా అయిపోయారు. ఈ అమ్మాయికి స్టార్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని జోస్యం చెప్పారు సినీ విశ్లేషకులు. మరి అందరూ అనుకున్నట్టుగా ప్రగ్యా స్టార్ అవుతుందో లేదో తెలియదు కానీ... స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశాన్ని మాత్రం చేజిక్కించుకుంది. ఇక ఈ సినిమా కూడా హిట్టయ్యిందంటే నిస్సందేహంగా ఆమె స్టార్ అయిపోయినట్టే.

రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఎవడో ఒకడు సినిమాకోసం ప్రగ్యాని కథానాయికగా ఎంచుకున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుంటారు. ప్రేమమ్ ఫేమ్ అనుపమ ఒక హీరోయిన్ కాగా కంచె భామ ప్రగ్యా మరో హీరోయిన్. బోలెడు మంది కథానాయికల్ని పరిశీలించాక ప్రగ్యానే ఫైనల్ చేశారట. ఇందులో రవితేజ లెక్చరర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది.

,  ,  ,