Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 15:37:20
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో సినిమాల్లో తెగ మెరుస్తున్న సంజనా గల్రానీ.. నిక్కీ గల్రానీలు అక్కా చెల్లెళ్లు అనే సంగతి తెలిసిందే. సంజన ఇప్పటికే శాండల్ వుడ్ లో సత్తా చాటే పనిలో ఉండగా.. నిక్కీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలలో కుదురుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఇప్పుడు ఒకేసారి బ్రేక్ తీసేసుకున్నారు.

ఇద్దరు భామలు ఒక్కసారే సడెన్ గా సినిమాలకు బ్రేక్ అనేసరికి చాలామందికి అనుమానాలు వచ్చేశాయి. దీని వెనుక అసలు సీక్రెట్ ఏంటో మాత్రం ఇప్పుడు తెలిసిపోయింది. ప్రస్తుతం సంజన-నిక్కీలు ఆస్ట్రేలియాలో మకాం వేశారు. మెల్ బోర్న్ అంతా కలియదిరిగేస్తున్నారు. అక్కడ వైల్డ్ లైఫ్ పార్కుల్లో చక్కర్లు కొడుతున్నారు. సింపుల్ గా చెప్పేస్తే అక్కా చెల్లెళ్లిద్దరూ ఆస్ట్రేలియాలో మహా ఎంజాయ్ చేసేస్తున్నారు.

'మేమిద్దరం రెగ్యులర్ గా టూర్స్-వెకేషన్స్ కి వెళుతూ ఉంటాం. కలిసి తిరిగేయడం మాకు బాగా ఇష్టం. కానీ గత ఐదేళ్లుగా ఇలా మేమిద్దరం కలిసి బయటకొచ్చేందుకు ఛాన్స్ రాలేదు. అందుకే ఇప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసేస్తున్నాం. ఇప్పుడు నిక్కీ నన్ను తెగ ఇబ్బంది పెడుతోంది. అయినా సంతోషంగానే' అని చెబుతోంది సంజన. మొత్తానికి అక్కా చెల్లెళ్లిద్దరూ ఆస్ట్రేలియాలో రచ్చ చేస్తున్నారన్న మాట.

,  ,  ,  ,  ,  ,