Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2015 10:52:47
facebook Twitter Googleplus
Photo

నటుడుగా బిజీగా వుండే ప్రకాష్ రాజ్ ఇప్పుడు స్టేజి ఎక్కడానికి సిద్ధపడుతున్నాడు. ఒక నాటకంలో నటించడానికి ఆయన సమాయత్తమవుతున్నాడు. మరో ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ రాసిన 'మంత్రపుష్పం' అనే కన్నడ నాటకంలో ముఖ్య పాత్రను ప్రకాష్ రాజ్ పోషించనున్నాడు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. శృంగారం, భక్తి రెండూ మిళితమైన ఈ కథలో కీలకమైన పూజారి పాత్రను తాను పోషిస్తున్నట్టు తెలిపాడు. ప్రతి రోజూ తాను చేసే కమర్షియల్ పాత్రలు, సినిమాల నడుమ తనకిది సేద తీరుస్తుందని అంటున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి నాటకాలలో నటిస్తేనే నటుడిగా తృప్తి లభిస్తుందని చెప్పాడు.

,  ,  ,  ,