Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2017 10:37:22
facebook Twitter Googleplus
Photo

తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హింది ఇలా ఏ బాషనైనా తీసుకోండి.. ఈ ఇండస్ట్రిలో ఒక గొప్ప నటుడు పేరు చెప్పండి అని అడిగితే అందరూ చెప్పే ఒకే పేరు.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. మాతృ బాష కన్నడం అయనా కూడా తెలుగు తమిళ్ మలయాళం అనర్గళంగా మాటలాడే నటుడు ఈయన. సౌత్ లో అన్నీ బాషల్లో డజెన్లు కొద్దీ సినిమాలు చేశాడు.

ఇప్పుడు మళ్ళీ మన తెలుగులో రామ్ చరణ్ - సుకుమార్ కొత్త మూవీలో ఒక ముఖ్య పాత్ర కోసం సుకుమార్ ప్రకాష్ రాజ్ని అడిగినట్టు తెలుస్తోంది. ప్రకాష్ స్క్రిప్ట్ విని కొంత టైమ్ తీసుకొని తరవాత నేను చేస్తాను అని చెప్పినట్లు టాక్. సుకుమార్ డైరక్షన్లో ప్రకాష్ రాజ్ 2007లో వచ్చిన జగడం సినిమాలో నటించారు. మళ్ళీ ఇన్నాళ్లుకి తిరిగి అతని డైరక్షన్లో ప్రకాష్ రాజ్ నటిస్తే అది వండరే. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా సెకండ్ షెడ్యూల్లో ప్రకాష్ జాయిన్ అయ్యే ఛాన్సుందట. నిజానికి గోవిందుడు అందరివాడేలే సినిమాతో ప్రకాష్ మెగా క్యాంపుకు ఇంకా క్లోజ్ అయ్యాడు. అందుకే చరణ్ ఇతగాడి పేరును సిఫార్సు చేశాడటలే.

ఇకపోతే సుకుమార్ ఈ మధ్య సినిమాలలో నాన్నలకి మంచి పాత్రలు రాస్తున్నారు. 1నేనొక్కడినే నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల్లో చాలా లోతైన పాత్రలే రాశారు.

,  ,  ,  ,  ,