మాస్ మహరాజ్ రవితేజ ఏం చేస్తున్నాడు? సెట్స్ దగ్గర నుంచి స్క్రీన్ స్పేస్ వరకూ హై ఎనర్జీ చూపించే రవితేజ.. ఇప్పుడు సినిమాలు చేయడం ఎందుకు తగ్గించేశాడు? అనే ప్రశ్నలకు రకరకాల ఆన్సర్లున్నాయి. అన్నిటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే.. రవితేజ ఎక్కడా తన పారితోషికం విషయంలో రూపాయి కూడా తగ్గనని భీష్మించుకుని కూర్చుంటున్నాడు. ఆ రేంజ్ లో ఇచ్చుకుంటే.. ప్రాజెక్టు ప్రారంభించకముందే డెఫిసిట్ లోకి వెళ్లిపోతామని నిర్మాతలు భయపడిపోతున్నారు.
అందుకే మాస్ మహరాజ్ తో మూవీ ప్రారంభిద్దామని అనుకుని.. స్టోరీ-డైరెక్టర్ సహా ఫైనల్ అయ్యాక కూడా.. నాలుగు సినిమాలు ఆగిపోయాయని టాక్. రవితేజ సినిమా స్టార్ట్ కాకపోవడానికి జనాలు అనుకుంటున్న రీజన్ ఇది. కానీ ఈ హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రం వేరేలా చెబుతున్నాడు. రవితేజ అసలు ఇలాంటివేమీ పెద్దగా పట్టించుకోడని.. రెమ్యూనరేషన్.. సినిమాలు చేయడం చేయకపోవడం లాంటివి కేర్ చేయడని అంటున్నాడు పూరీ.
గత 15 ఏళ్లుగా బ్రేక్ లేకుండా తామిద్దరం కష్టపడుతున్నామని.. అనుకోకుండా వచ్చిన ఈ సమయాన్ని ప్రపంచం చూడ్డానికి రవితేజ కేటాయిస్తున్నాడని చెప్పాడు పూరీ జగన్నాధ్. తన ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ లో ఉండడంతోనే ఏ ప్రాజెక్టును పట్టాలెక్కించడం లేదంటూ కొత్త వెర్షన్ వినిపించాడు కూడా.