Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 15:27:51
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూడీ రిలీజ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. మహేష్ తో ముగ్గురు హీరోయిన్లు ఆడిపాడిన ఈ మూవీలో.. కేరక్టర్ల తీరుతెన్నులు ఏంటో ఇప్పటివరకూ పెద్దగా రివీల్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో.. టీజర్ ల టైపుల పాత్రల గురించి ఒక్కో కబురు చెబుతున్నారు పాత్రధారులు.

బ్రహ్మోత్సవంలో మహేష్ కు మరదలిగా నటించిన ప్రణీత.. తన కేరక్టర్ గురించి - మహేష్ రోల్ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పేసింది. 'బ్రహ్మోత్సవంలో కుటుంబంలోని వ్యక్తులు ఏం చెప్పినా సంతోషంగా స్వీకరించే పాత్ర చేస్తున్నాను. ఇలాంటి రోల్ తెలుగులో మొదటి సారి చేస్తున్నాను. ఇది నాకు కొత్త అనుభవం. అయితే.. మహేష్ పాత్ర నా రోల్ కు పూర్తి విభిన్నంగా ఉంటుంది. తను కుటుంబాన్ని ప్రేమించినా - వారు చెప్పినవన్నిటినీ అంగీకరించదు. తనకు నచ్చితేనే చేసే రోల్ అది. అలాగే తప్పు చేస్తే దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు మహేష్' అని చెప్పిన ప్రణీత తమ ఇద్దరి మధ్య సన్నివేశాల పైనా ఓ పజిల్ విసిరింది.

మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయా అని అడిగితే.. 'చాలా ఫన్నీగా మా సన్నివేశాలు ఉంటాయి. మిగిలిన డీటైల్స్ ఆన్ స్క్రీన్ పై చూడాల్సిందే' అంటోంది ప్రణీత.

,  ,  ,  ,  ,