Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jul-2015 13:37:04
facebook Twitter Googleplus
Photo

సినిమాలో కథ వున్నా లేకపోయినా 'ఐటెమ్ సాంగ్' మాత్రం ఉండి తీరాలనే పరిస్థితుల్లో, తాను ఐటెమ్ సాంగ్స్ మాత్రం చేయనని ప్రణీత తేల్చిచెబుతోంది. పారితోషికం కాస్త ఎక్కువిస్తే చాలు ఐటెమ్ సాంగ్స్ చేయడానికి కొంతమంది కథానాయికలు పోటీపడుతోన్న తరుణంలో, ప్రణీత ఈ నిర్ణయం తీసుకుకోవడం సాహసమేనని అంటున్నారు. ఎందుకంటే కథానాయికగా ఆశించిన స్థాయి క్రేజ్ ని ఆమె ఇంకా అందుకోనే లేదు.


తమిళ .. కన్నడ సినిమాల సంగతి అటుంచితే, తెలుగులో ఆమె ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. విష్ణు జోడీగా ఆమె చేసిన 'డైనమైట్' త్వరలో విడుదల కానుండగా, మహేష్ 'బ్రహ్మోత్సవం'లోను ఛాన్స్ దక్కించుకుంది. బహుశా ఈ స్థాయిని నిలబెట్టుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

,  ,