Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2017 12:02:53
facebook Twitter Googleplus
Photo

సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ కొంత కాలంగా స్టార్ డమ్ ను పక్కనబెట్టి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన చిత్రం గురు. సుధా కొంగర డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో వెంకీ ఒక బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్ లు ప్రేక్షకులు అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో చిత్ర యూనిట్ అభిమానులకు నిరాశ కలగకుండా ఈ నెల 17న ఏయ్ సక్కనోడా అనే వీడియో పాటను రిలీజ్ చేయనున్నారు. అలాగే చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, త్వరలోనే తేదీనీ కూడా ప్రకటటిస్తామని నిర్మాత శశికాంత్ అన్నారు. ఇకపోతే ?శాల ఖందూస్? కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో కూడా రితికా సింగ్ హీరోయిన్ గా నటించింది.

,  ,  ,  ,