Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2017 10:37:28
facebook Twitter Googleplus
Photo

షూటింగ్ టైం లో రకరకాల వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సహజంగా ఇలాంటివి పక్కన పెట్టేసి.. ఫైనల్ గా సినిమా కోసం వర్క్ చేసుకుంటారంతా. అయితే.. ఇప్పుడు మీడియా బాగా యాక్టివ్ అయిపోవడంతో.. పాత విషయాలను కూడా అడిగి మరీ బైటకు తీసి ఏదో ఒక సెన్సేషన్ ను సృష్టించేస్తున్నారు. ఓ హీరోతో గొడవ గురించి కొన్నేళ్ల తర్వాత ఓ డైరెక్టర్ చెప్పడం అంటే విచిత్రమైన విషయమే.

సందీప్ కిషన్ తో ఇలా తనకు గతంలో గొడవ అయిన విషయంపై రియాక్ట్ అయ్యాడు ప్రవీణ్ సత్తారు. పీఎస్వీ గరుడవేగ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. రొటీన్ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ సమయంలో మా మధ్య కొన్ని విబేధాలు వచ్చాయి. సందీప్.. అతని స్నేహితులు సినిమాలో కొంత పెట్టుబడి పెట్టారు. ప్రొడక్షన్ స్టేజ్ లో బడ్జెట్ విషయంలో మాట మాట వచ్చింది. ఆ తర్వాత పెట్టుబడిపై నేనే కేర్ తీసుకుని.. అతని డబ్బులు తిరిగి ఇచ్చేశాను అని చెప్పాడు ప్రవీణ్ సత్తారు.

రొటీన్ లవ్ స్టోరీ మూవీ కోసం కొంత భాగం ఉత్తరాఖండ్ లో షూటింగ్ చేశాం. ప్లాన్ చేసుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చు అవడంలో అశ్చర్యమేమీ లేదు. అప్పుడు 15 లక్షలు తేడా వచ్చింది. బడ్జెట్ లిమిట్ దాటిపోతోందంటూ సందీప్ తెగ టెన్షన్ పడిపోయాడు. నేను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

,  ,  ,  ,