Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 11:32:00
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే ప్రేమమ్ పోస్టర్లు.. మిగతా ప్రోమోలు ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రతి రోజూ కొన్ని రోజుల నుంచి ఆహ్లాదకరమైన పోస్టర్లతో పలకరిస్తూ ఉంది ?ప్రేమమ్? టీమ్. తాజాగా రిలీజ్ చేసిన రిలీజ్ డే పోస్టర్ వాటన్నింటినీ మించిపోయింది. అక్కినేని నాగచైతన్యను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ అదిరిపోయే పోస్టర్ వదిలారు గురువారం అర్ధరాత్రి. చైతూ మునుపెన్నడూ లేనంత అందంగా.. ట్రెండీగా తయారై స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. ?ప్రేమమ్? సినిమాకు సంబంధించి చైతూ ప్రతి లుక్ కూడా మొదట్నుంచి ఆకట్టుకుంటూనే వస్తుండగా.. వాటిలో ఇది పీక్స్ అనే చెప్పాలి.

ఇందులో చైతూ లుక్ చూడగానే.. మన్మథుడికి సరైన వారసుడే అనిపించడం ఖాయం. నాగ్ ను తలపించేలా ఉన్నాడు చైతూ ఇందులో. ఇక ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తున్న ?ప్రేమమ్? మీద ఫుల్ పాజిటివ్ బజ్ ఉంది. మలయాళ ?ప్రేమమ్? మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడానికి చందూ మొండేటి అండ్ కో గట్టి ప్రయత్నమే చేసినట్లుంది. ఆల్రెడీ ప్రిమియర్ల నుంచి కూడా టాక్ పాజిటివ్ గా వస్తోంది. మామూలుగానే లవ్ స్టోరీల్లో చైతూకు మంచి రికార్డుంది. పైగా ?ప్రేమమ్? మరింత ఫీల్ ఉన్న సినిమా. ముగ్గురు హీరోయిన్లూ ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. వాళ్లతో చైతూ రొమాన్స్ సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. దసరాకు పోటీ తీవ్రంగా ఉన్నా ప్రధానంగా సినీ ప్రియుల కళ్లన్నీ ఈ చిత్రం మీదే ఉన్నాయి.

,  ,  ,  ,  ,