Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2017 16:39:31
facebook Twitter Googleplus
Photo

షూటింగ్ చివరి దశలో ఉందంటే చాలు చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే ఆడియో వేడుకని లేదా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి సినిమాకి హైప్ ని పెంచుతారు. అదే విధంగా ఆ వేడుకల్లో జనాలను ఆకట్టుకునేందుకు ఓ స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకొని వస్తారు కొందరు. సినిమాల్లో నటించినవారు అలాగే సినిమాకు పని చేసిన వారు వారి యొక్క అనుభూతులను చెప్పుకుంటారు.

అయితే రీసెంట్ గా నాగ చైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం సినిమా ఆడియో వేడుకను గ్రాండ్ సెలబ్రేట్ చేశారు ఆ సినిమాను నిర్మించిన సాయి కొర్రపాటి. ఆ వేడుకకి చాలామంది వచ్చారు కానీ మెయిన్ గా చెప్పుకునే హీరోయిన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాత్రం మిస్ అయ్యింది. దీంతో ఆమె సినిమాపై కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమి లేదు అనే విధంగా ఆమె సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోందట. రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ లో కూడా ఇంటర్వ్యూకు కు హాజరై చిత్రం గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడింది. సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా అందరికి నచ్చుతుందని ఆశాభావం కూడా వ్యక్తం చేసింది.

అయితే ఈ సినిమా హిట్ చైతూకి అంతగా అవసరం లేకపోయినా లావణ్య కోసం మాత్రం తప్పకుండా హిట్ కావలి. ఎందుకంటే ఆమె గత ఏడాది నాగార్జునతో నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం తర్వాత ఒక్క హిట్ ను కూడా అందుకోలేదు. వరుసగా అపజయాలను అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ హీరోగా తెరకెక్కుతున్న "ఉన్నది ఒకటే జిందగీ సినిమా" తో పాటు మరో తమిళ్ సినిమాలో నటిస్తోంది.

,  ,  ,  ,  ,