Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2016 12:15:39
facebook Twitter Googleplus
Photo

మళయాలంలో సంచలన విజయం సాధించిన ?ప్రేమమ్? సినిమాను తెలుగులో అదే పేరుతో అక్కినేని నాగ చైతన్య రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటిస్తోన్న ఈ సినిమాను ?కార్తికేయ?తో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే నెలలో నార్వేలో రెండు పాటల షూటింగ్ జరుపుకోనుంది.
జూలై 14న మొదలయ్యే ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక ఆగష్టు 7న గోపీ సుందర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను విడుదల చేయనున్నట్లు టీమ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. తన కెరీర్‌కి బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందని నాగ చైతన్య మొదట్నుంచీ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేయనున్న ఈ సినిమా ఆగష్టు నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,