Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 14:11:56
facebook Twitter Googleplus
Photo

తెలుగులో మాంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం అయిపోయింది. ఇలాంటి టైంలో ?ప్రేమమ్? ఆ లోటు తీర్చడం ఖాయమన్న అంచనాతో ఉన్నారు యూత్ ఆడియన్స్. శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజవుతోంది. ఐతే అంత కంటే ముందు యుఎస్ లో ప్రిమియర్స్ పడిపోతున్నాయి. అమెరికాలో నాగచైతన్య కెరీర్లోనే అత్యధికంగా 110కి పైగా లొకేషన్లలో ?ప్రేమమ్? రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ లొకేషన్లన్నింటిలోనూ ప్రిమియర్లు కన్ఫమ్ అయ్యాయి.

అక్కడి టైమింగ్ ప్రకారం సాయంత్రం 5-6 గంటల మధ్య ప్రిమియర్లు పడుతున్నాయి. ?జనతా గ్యారేజ్? తర్వాత రిలీజవుతున్న పెద్ద తెలుగు సినిమా ఇదే కావడంతో దీనికి బెస్ట్ స్క్రీన్స్ దక్కాయి. సినీ మార్క్.. కార్మైక్.. ఏఎంసీ.. రీగల్ లాంటి బెస్ట్ స్క్రీన్లను ?ప్రేమమ్?కు కేటాయించినట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రాన్ని అమెరికాలో బ్లూ స్కై ఓవర్సీస్ రిలీజ్ చేస్తోంది. సోలో హీరోగా చైతూకిది బిగ్గెస్ట్ రిలీజ్ కాగా.. కలెక్షన్ల పరంగా కూడా నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు. దసరాకు ఐదు సినిమాలు వస్తున్నప్పటికీ అన్నిటి కంటే ఎక్కువ అంచనాలున్నది.. పాజిటవ్ బజ్ తో రిలీజవుతున్న ?ప్రేమమ్? సినిమానే. ఇదే దసరా విన్నర్ అవుతుందని భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,