తెలుగు అభిమానులకు బాగా పరిచయమైన హీరో విశాల్. తమిళ్ లో చేసిన ప్రతి సినిమాను తప్పకుండా తెలుగులో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతే కాకూండా తెలుగులో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు. తెలుగు అభిమానులను బాగానే సంపాదించుకున్న ఈ హీరో మొదట్లో అందుకున్న ఆదరణను ఈ మధ్య అంతగా అందుకోవడంలేదు. తమిళ్ లో హిట్ అయిన సినిమాలు కూడా ఇక్కడ ఏ మాత్రం సక్సెస్ అవ్వడం లేదు.
ఇటీవల విడుదలైన డిటెక్టివ్ ఓ వర్గం వారికీ నచ్చినా కలెక్షన్స్ పరంగా మాత్రం యావరేజ్ అనిపించుకుంది. అయితే నెక్స్ట్ ఇయర్ జనవరిలో విశాల్ మరో సినిమాతో రాబోతున్నాడు. కరెక్ట్ గా సంక్రాంతి కానుకగా ఆ నెల 13న తన అభిమన్యుడు సినిమాని రిలీజ్ చేయనున్నాడు. రీసెంట్ గా సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే అదే టైమ్ కి తెలుగులో పవన్ కళ్యణ్ 25వ చిత్రం రాబోతోంది. అలాగే బాలకృష్ణ - జయ సింహా కూడా రానుంది. పండగ సీజన్ లో ఈ హీరోలకు ఎదురులేదు. మరి ఆ టైమ్ లో విశాల్ అభిమన్యుడు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ మూవీని పీఎస్.మిత్రన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ తరహాలో ఉండనుందని తెలుస్తోంది.