Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2015 12:34:00
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు నటిస్తున్న 'శ్రీమంతుడు' చిత్రం ఆడియో వేడుకకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 18న ఈ వేడుకను అభిమానుల సమక్షంలో హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం మాదాపూర్ లోని శిల్పకళావేదిక ఆడిటోరియంను ఎంచుకున్నారు. ఆనాటి కార్యక్రమాన్ని విభిన్నమైన వేడుకలా నిర్వహించడానికి డిజైన్ చేస్తున్నారు. మరోపక్క, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 7న చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన సంగతి మనకు తెలిసిందే.

,  ,  ,  ,