Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Dec-2015 17:42:46
facebook Twitter Googleplus
Photo

నాగార్జున, బాలకృష్ణ , ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో నటించి ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా వెలిగింది ప్రియమణి. అయితే కొత్త భామలొచ్చాక ఆమె జోరు పూర్తిగా తగ్గిపోయింది. అనుష్కలాంటి తోటి కథానాయికల హవా అలాగే సాగింది కానీ ప్రియమణి మాత్రం కొన్ని చెత్త సినిమాలు చేసి తన క్రేజ్ ని తానే చేజేతులా తగ్గించుకొంది. మలయాళం - కన్నడ భాషల్లోకి వెళ్లినా అక్కడా పెద్దగా కలిసిరాలేదు. టాలీవుడ్ లో అయితే రెండుమూడేళ్లుగా ఆమె అస్సలు కనిపించలేదు. ఐటెమ్ పాటల్లోనైనా మెరుస్తుందేమో అనుకొంటే అదీ జరగలేదు. ఇక పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోయిందని భావిస్తున్న తరుణంలో ఆమె మళ్లీ ఓ క్రేజీ ఆఫర్ ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరించింది.

ప్రకాష్రాజ్ దర్శకత్వం వహించననున్న `మన ఊరి రామాయణం` అనే సినిమాలో ప్రియమణి కథానాయికగా ఎంపికైంది. తెలుగు - తమిళ - కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని తెరకెక్కిస్తారు. మూడు భాషల్లోనూ ప్రియమణినే కథానాయికగా తీసుకొన్నారట. దాంతో.. మూడు చోట్లా ప్రియమణి తన సత్తా చూపించే అవకాశం దక్కిందన్నమాట. ఈ సినిమా నుంచి ఆమె మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టిపెట్టాలని ప్రియమణి డిసైడైయిందట. కనీసం కాసిన్ని ఐటెమ్ పాటల్లోనైనా మెరవాలన్న ఆలోచనలో ఆమె ఉందట. మరి ఆమె అనుకొన్నది జరుగుతుందో లేదో చూడాలి.

,  ,  ,