Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2015 11:01:52
facebook Twitter Googleplus
Photo

అనుష్క ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న 'రుద్రమదేవి' చిత్రం ఆడియోను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేస్తారు. ఈ విషయాన్ని లహరి మ్యూజిక్ సంస్థ ప్రకటించింది. దీని గురించి లహరి అధినేత జి.మరోహర్ నాయుడు మాట్లాడుతూ, "ఈ ఏడాది మొదట్లో మేము విడుదల చేసిన 'గోపాల గోపాల' ఆడియో చార్ట్స్ లో టాప్ పొజిషన్ లో వుంది. గతంలో మేం ఇళయరాజా గారి ఆల్బమ్స్ చాలా రిలీజ్ చేశాం. అయితే, గుణశేఖర్ గారు తీస్తున్న 'రుద్రమదేవి' ప్రతిష్ఠాత్మక చిత్రం ఆడియో రిలీజ్ చేయడం గౌరవంగా, గర్వంగా ఫీలవుతున్నాం. అందుకే, ఫ్యాన్సీ రేటు ఇచ్చి హక్కులు తీసుకున్నాం" అని చెప్పారు. ఫిబ్రవరి థర్డ్ వీక్ లో ఈ పాటలను రిలీజ్ చేస్తామన్నారు.

,  ,  ,  ,  ,