Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2016 15:30:10
facebook Twitter Googleplus
Photo

ఇతర దేశాలకు తరలివెళ్లే శరణార్థులను - వలసవాదులను కించపరిచేలా ఉన్న రాతలు కలిగిన వైట్ కలర్ టీషర్ట్ ను వేసుకుని ఉన్న ప్రియాంక ఒక ట్రావెలర్ మేగజీన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. దీంతో ఆ టీషర్ట్ పై రకరకాల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనాలకు విపరీతమైన కోపం తెప్పించిన ఆ టీషర్ట్ పై బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా స్పందించింది. ట్రావెలర్ మేగజీన్ కవర్ పేజీపై తాను ధరించిన టీషర్ట్ పై తనను క్షమించాలని వేడుకుంది. వారి వారి మనోభావాలను కించపరిచినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్టు పేర్కొన్న ప్రియాంక... కొండే నాస్ట్ ట్రావెలర్ వాళ్లే స్పెషల్ గా ఈ టీషర్ట్ ను తెప్పించారని వారే తనను వేసుకోమన్నారని తెలిపింది. అయితే ఆ టీషర్ట్ ధరించడం వెనక తాము శరణార్థులను - వలసవాదులను కించపరచడానికి చేసే ఉద్దేశ్యం లేదని.. ప్రస్తుతం నెలకొన్న జెనోఫోబియాను గుర్తించడానికి ఈ టీషర్ట్ ధరించాల్సిందిగా వారు కోరగా తాను ధరించానని తెలిపింది.

కాగా ప్రియాంక ధరించిన ఆ టీషర్ట్ పై రెఫ్యూజీ (శరణార్థి) - ఇమ్మిగ్రెంట్ (వలసవాది) - ఔట్ సైడర్ (బయటి వాడు) - ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు రాసి ఉండగా వీటిలో ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి మిగిలిన రెఫ్యూజీ - ఇమ్మిగ్రెంట్ - ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి ఉంది. ఆ కవర్ పేజ్ పిక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శింస్తూ... ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటికి శరణార్థుల బాధలు ఏమి తెలుస్తాయిలే అని కామెంట్స్ మొదలైన సంగతి తెలిసిందే.

,  ,  ,