Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jun-2015 17:58:58
facebook Twitter Googleplus
Photo

ప్రాధాన్యతను కలిగిన పాత్రలను ఎంచుకుంటూ రమ్యకృష్ణ చకచకా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. 'బాహుబాలి' చిత్రంలోనూ .. 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలోను కీలకమైన పాత్రలలో కనిపించనున్న ఆమె, తాజాగా ఓ చిత్రంలో కాలేజ్ ప్రొఫెసర్ గా నటించనుంది. కాలేజ్ నేపథ్యంలో నిర్మించబడుతోన్న ఆ సినిమా పేరు 'లొల్లి'.

కాలేజ్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రేమకథలు పుట్టుకొస్తూనే వుంటాయి. యూత్ ని ఆకట్టుకోవడానికి తమవంతు ప్రయత్నం చేస్తూనే వుంటాయి. అలా ఉమాపార్వతి నిర్మాతగా .. మనోజ్ దర్శకత్వంలో మరో ప్రేమకథ రూపొందనుంది. హృదయానికి హత్తుకునే ఈ ప్రేమకథలో క్రేజ్ వున్న నాయకా నాయికలు నటించనున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. తమన్ బాణీలను సమకూరుస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని అన్నారు.

,  ,