Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2017 13:50:48
facebook Twitter Googleplus
Photo

తన హీరోల గురించి చాలా గొప్పగా చెప్పేస్తుంటాడు పూరి జగన్నాథ్. ఐతే ఒకప్పుడు ఆయన మాటలకు తగ్గట్లే సినిమాలుండేవి కాబట్టి ఆ మాటలు బాగానే అనిపించేవి. కానీ గత కొన్నేళ్లలో ఆయన మాటలకు.. సినిమాలకు పొంతన కుదరట్లేదు. సినిమా సినిమాకూ ఆయన స్థాయి పడిపోతోంది. తన సినిమాల్ని తనే కాపీ కొడుతూ.. ఒకే తరహా కథలతో.. పాత్రలతో బోర్ కొట్టించేస్తున్నాడు పూరి. తాజాగా రోగ్ ట్రైలర్ చూసినా ఏమంత కొత్తగా అనిపించలేదు. ఇక ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ సినిమా గురించి.. హీరో ఇషాన్ గురించి ఓ రేంజిలో పొగిడేశాడు పూరి.

‘రోగ్’ సినిమా భలేగా వచ్చిందని.. నిర్మాత సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ వేసి చూసుకుని మురిసిపోతున్నాడని చెప్పాడు పూరి. ఇక హీరో ఇషాన్ గురించి మాట్లాడుతూ.. మంచి హైట్ మంచి కలర్ ఉన్న కుర్రాడని.. భవిష్యత్తు చాలా పెద్ద స్టార్ కాబోతున్నాడని అన్నాడు పూరి. ఈ సినిమా షూటింగ్ ఫారిన్లో చేస్తున్నపుడు అక్కడి జనాలు అతణ్ని ఒక సూపర్ స్టార్ లాగా ట్రీట్ చేశారన్నాడు పూరి. ఆటోగ్రాఫుల కోసం ఎగబడ్డారని.. అమితాబ్ అమితాబ్ అని అతణ్ని పిలిచారని కూడా పూరి చెప్పాడు. ఐతే చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నట్లు కనిపిస్తూనే తన సినిమాల గురించి గొప్పగా చెప్పుకోవం పూరికి ఈ మధ్య అలవాటుగా మారింది. కానీ సినిమాలు చూస్తే ఆ స్థాయికి తగ్గట్లు ఉండట్లేదు

,  ,  ,  ,  ,  ,  ,