Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 12:07:54
facebook Twitter Googleplus
Photo

బాహుబ‌లి సృష్టించిన ప్ర‌కంప‌నాలు ఇంకా మ‌దిలో మెదులుతూనే ఉన్నాయి. ఆ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుడు ప్ర‌తి రోజూ ఏదో ఓ సంద‌ర్భంలో బాహుబ‌లిని త‌ల‌చుకొంటూనే ఉన్నాడు.

ఇప్పుడు బాహుబ‌లి 2 కూడా రికార్డుల వేట మొద‌లెట్టేసింది. ఇప్ప‌టి నుంచే బాహుబ‌లి 2 మానియా షురూ అయిపోయింది. ఈసినిమాని కొనేందుకు బ‌య్య‌ర్లు ఎగ‌బ‌డుతున్నారు. ఓవ‌ర్సీస్‌లో బాహుబ‌లి2 ని ఏకంగా రూ.33 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేశారని ఆమధ్య ఓ వార్త వినిపించింది.

ఇప్పుడు మరో అదిరిపోయే న్యూస్ ఏమిటంటే.. బాహుబలి హిందీ వెర్షన్ లో తెగ అదేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాహుబ‌లి 2 పై అక్కడ భారీ అంచనాలు వున్నాయి. ఈ అంచనాలు తగ్గట్టు ఈ సినిమా హిందీ వెర్షన్ శాటిలైట్ బాంబ్ పేలింది. జీఈసీ ఛానెల్ ఈ సినిమాకు రూ.50 కోట్ల శాటిలైట్ కోసం ఆఫర్ చేసిందని సమాచారం.

ప్రస్తుతం నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. బాహుబలి క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా ఇంకా ఎక్కువ రేటు పలుకుతుందనేది చిత్ర వర్గాల అంచనా. ప్రస్తుతం బేరసారాలు జరుగుతున్నాయి. మరి ఈ లెక్క ఎంతకు తెగుతుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,