Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2015 12:43:04
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్ ఏ క్యారెక్టర్ క్రియేట్ చేసినా సంచలనమే. బన్నిని దేశముదురిని చేసినా రవితేజని ఇడియట్ ని చేసినా మహేష్ ని పోకిరిగా - బిజినెస్ మేన్ గా చూపించినా - పవన్ ని రాంబాబుగా చూపించినా - ఎన్టీఆర్ ని టెంపరున్నోడిగా చూపించినా అవన్నీ సంచలనం అయ్యాయి. ఇప్పుడు లోఫర్ సినిమాతో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని లోఫర్ ని చేస్తున్నాడు. ఒక దొంగ మంచిగా ఎలా మారతాడు అన్నది చూపిస్తున్నాడు. లోఫర్ షూటింగ్ పూర్తయింది. 3రోజుల షూటింగ్ బ్యాలెన్ష్ మినహా అంతా పూర్తయినట్టే.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారె్క్టరైజేషన్ హైలైట్ గా ఉంటుందని పూరి చెబుతున్నాడు. ఈ ఎటెంప్ట్ చూస్తుంటే మెగా హీరో వరుణ్ తేజ్ ని రెండో సినిమాతోనే కమర్షియల్ హీరోగా చూపిస్తున్నాడని అర్థమవుతోంది. వరుణ్ ఎంత పొడవుగా ఉంటాడో అంత అమాయకంగా కనిపిస్తాడు. అదే అతడిని పెద్ద స్టార్ ని చేస్తుంది అన్నారు పూరి. నాగబాబు గర్వించే హీరో అవుతాడని కితాబిచ్చాడు. పెద్ద స్టార్ అవుతాడని పొగిడేశాడు. ఇదంతా చూస్తుంటే లోఫర్ ఇండస్ర్టీని షేక్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు హైలైట్ గా వచ్చాయని పూరి కేవ్ లోని జనాలు ముచ్చటించుకోవడం హాట్ టాపిక్.

అయితే ఈ సినిమా టైటిల్ ను ముందుగా లోఫర్ అన్నాడు పూరి జగన్. కాని అప్పుడు ఆ టైటిల్ ఎవ్వరికీ నచ్చలేదు. ఇప్పుడేమో ఈ సినిమా టైటిల్ ను మార్చేస్తా అంటున్నాడు. కాని ఇప్పుడు నిర్మాత సి.కళ్యాణ్ వంటి వారు మాత్రం సినిమా టైటిల్ మాకు నచ్చేసింది అంటున్నారు. ఇంతకీ లోఫర్ టైటిల్ ఉన్నట్లా లేనట్టా?

,  ,  ,