Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Aug-2015 15:46:39
facebook Twitter Googleplus
Photo

తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఎవరో తెలుసంటున్న మహేష్ తెలుగురాష్ట్రాల్లో పూలు పాలకు కరువొచ్చేసింది. కారణమేంటో తెలుసా.. మహేష్ పండగ మొదలైపోయంది. ఫ్యాన్స్ పాలభిషేకాలు పూల దండలతో తమ అభిమాన నటుడికి నీరాజనాలు పలుకుతున్నారు. ఇలాంటి పండగ వాతావరణంలో... అంతకంటే తీపి కబుర్లు చెప్పాడు మహేష్ బాబు. తాము ఆరాధించే నటుడి నుంచి తమకు నచ్చే కబుర్లు వింటుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది కదా. అందుకే అభిమానులతో మనసులోని మాటలు పంచుకున్నాడు ప్రిన్స్.

తానే నెంబర్ వన్ అనే ఫీలింగ్ మహేష్ కు ఎప్పుడూ లేదు. అసలు నెంబర్ వన్ అనే మాట ఎప్పుడో పోయిందని... ఇప్పుడున్న ట్రెండ్ లో ఆ ఛాన్స్ లేదంటున్నాడు మహేష్. యాక్టర్స్ కంటే సినిమాలే పెద్దవని ప్రతీ శుక్రవారం థియేటర్ కి వచ్చే మూవీయే స్టార్ అన్న మహేష్... ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీకి రాజమౌళి నెంబర్ వన్ అంటూ కరాఖండీగా చెప్పేశాడు.

చొక్కా గుండీ కూడా విప్పేందుకు ఇష్టపడని ఈ పోకిరి... తొలిసారిగా లుంగీ ఎగ్గట్టి కట్టాడు శ్రీమంతుడి కోసం. మరి సిక్స్ ప్యాక్ ఎప్పుడు అని ప్రశ్నిస్తే.. జనాలకు తెలీని ఓ విషయాన్ని బైట పెట్టాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే కోసం సిక్స్ ప్యాక్ చేశానని... కానీ బాడీ ప్రదర్శించేందుకు తాను ఇష్టపడనని అందుకే సినిమాలో ఆ సీన్ లేదని... ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏమైనా ఈ రాజకుమారుడు తన సిక్స్ ప్యాక్ బాడీని టక్కరిదొంగలా దాచేసుకున్నాడన్న మాట. ఇదన్యాయం మహేష్... కోట్ల మంది ఫ్యాన్స్ కోరిక... నువ్వు చొక్కా విప్పితే చూడాలని... ఓసారి చూపిస్తే పోదూ...

,  ,  ,