Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2016 11:51:27
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్లో అత్యంత వేగంగా సినిమాల్ని అవ్వగొట్టే దర్శకుల్లో పూరి జగన్నాథ్ పేరు ముందు చెప్పుకోవాలి. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయి ఉండి కూడా ఏ హడావుడి లేకుండా రెండు మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసేస్తుంటాడు పూరి. మహేష్ లాంటి బడా హీరోతో సైతం ?బిజినెస్ మేన్? సినిమాను 74 రోజుల్లోనే తీసేశాడు. ఇక కాస్త చిన్న సినిమాలైతే చెప్పనక్కర్లేదు. 50 రోజుల్లోనే పనైపోతుంది. ఆ మధ్య ఇషాన్ అనే కన్నడ కుర్రాడిని హీరోగా పెట్టి ?రోగ్? అనే సినిమాను పూరి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో ఈ సినిమా ఆగిపోయినట్లుగా కూడా వార్తలొచ్చాయి కానీ.. అదేమీ లేదని చెప్పాడు పూరి. ముందు అనుకున్న ప్రకారమే ఈ సినిమాను పూర్తి చేసేశాడు.

చడీచప్పుడు లేకుండా ?రోగ్? మూవీని అవగొట్టేసి.. ఈ రోజే కళ్యాణ్ రామ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. ఈ సినిమా తీస్తూనే ?రోగ్? పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పర్యవేక్షించబోతున్నాడు పూరి. కొత్త హీరో కావడంతో ప్రమోషన్ భారీ లెవెల్లో చేసి.. ఆ తర్వాత మంచి టైమింగ్ చూసి ?రోగ్?ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. శ్రీకాంత్ తో ?మహాత్మ? సినిమా తీసిన సీఆర్ మనోహర్ కొడుకే ఈ ఇషాన్. వీళ్లది కర్ణాటక కావడంతో సినిమాను తెలుగు-కన్నడ భాషలు రెండింట్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. కేవలం పూరి పేరు మీదే ఈ సినిమా నడవాల్సి ఉంది. పూరికి కన్నడ నాట కూడా మంచి పేరే ఉంది. ప్రస్తుత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అరంగేట్రం పూరి మీదే జరిగిందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి పూరి రూ.10 కోట్ల దాకా పుచ్చుకున్నట్లు సమాచారం.

,  ,  ,  ,  ,  ,