Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 11:00:52
facebook Twitter Googleplus
Photo

తనకు కావలసిన అవుట్ పుట్ వచ్చెనంతవరకూ ఆర్టిస్ట్ లను ఇబ్బంది పెట్టడానికైనా వెనుకాడని దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. వంశీమీద హీరోలు - హీరోయిన్లు కంప్లయింట్ చెయ్యడం మామూలే. ఇదే వరుస ఇప్పుడు నక్షత్రం షూటింగ్ లోనూ జరిగింది. అయితే ఈసారికి అంతా సరదాకే.

వివరాలలోకి వెళ్తే సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటిస్తున్న నక్షత్రం సినిమా షూటింగ్ లో ఒక పిక్ ని పోస్ట్ చేసి దానికి ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. నటి ప్రగ్యా తనని కొట్టినట్టుగా ప్రిన్సిపాల్ వంశీకి స్టూడెంట్ కంప్లయింట్ చేస్తున్నట్టు పెట్టడం గమనార్హం.

దానికి వంశీ ప్రగ్యాని నిజంగా కొట్టావా అని అడుగుతుంటే ప్రగ్యా ప్రాక్టీస్ లో భాగంగా చేసిందే కాకపోతే నాకు నచ్చిందని ఫన్నీ రిప్లై ఇచ్చనట్టు అమర్చారు. ఈ టైపు షూటింగ్ పిక్స్ ఈ మధ్య విడుదల చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమా షూటింగ్ పిక్స్ సైతం ఈ కాన్సెప్ట్ లోనే విడుదల చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,