Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Sep-2015 15:52:55
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే కూడా ఆయన వ్యక్తిగత విషయాలే ఇప్పుడు హాట్ టాపిక్. ట్విట్టర్ వేదికగా రోజుకో వివాదంలో వేలు పెడుతుంటాడు వర్మ. ఆయన తరచుగా టచ్ చేసే టాపిక్.. దేవుడు. గత ఏడాది వినాయక చవితి సమీపిస్తుండగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య పుష్కరాల విషాదం టైంలోనూ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఆయనో నాస్తికవాది అని.. దేవుణ్ని అస్సలు నమ్మడని.. అందరికీ తెలుసు. తన సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా వర్మ ఎప్పుడూ ఇష్టపడింది లేదు. అలాంటోడు దేవుడికి తలవంచి దండం పెడుతున్న దృశ్యం కనిపిస్తే అంత కంటే పెద్ద వార్తాంశం ఏముంటుంది?

ఈ సంగతి బాగా తెలుసు కనుకే మంచు మనోజ్.. ఛాన్స్ వదులుకోలేదు. ఎక్కడ దొరికాడో ఎలా దొరికాడో కానీ.. వర్మ వినాయకుడికి దండం పెడుతూ కెమెరాకు చిక్కేశాడు. ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసి.. ??చిట్టచివరికి వర్మ దేవుడికి తలవంచాడు?? అనే వ్యాఖ్య జోడించి వదిలేశాడు మనోజ్. ఇక అంతే ట్విట్టర్లో ఈ ఫొటో హాట్ టాపిక్ అయిపోయింది. వినాయకుడు పాలు తాగాడన్నది అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో.. వర్మ వినాయకుడికి దండం పెట్టాడన్నది అంతే సెన్సేషన్ అయి కూర్చుంది. వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ ఈ ఫొటో మీద ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ??ఇంత సడెన్ నువ్విక్కడికి ఎందుకొచ్చినట్లు. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి.. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని వర్మను దేవుడు తిడుతుండొచ్చు?? అని వ్యాఖ్యానించాడు పూరి. ఇలాంటి జోకులు ఇంకా చాలానే పేలుతున్నాయి ట్విట్టర్లో.

,  ,  ,  ,