Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 11:35:28
facebook Twitter Googleplus
Photo

పటాస్ సినిమాతో హీరోగా వచ్చిన కమర్షియల్ స్టేటస్‌ను ఆ తర్వాత వచ్చిన షేర్‌ తో అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్, తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్లో ఇప్పటివరకూ పూరీ స్థాయి డైరెక్టర్‌తో పనిచేయని కళ్యాణ్ రామ్, ఈ సినిమా కోసం ఓ సరికొత్త లుక్‌ను ట్రై చేసి ఆశ్చర్యపరిచారు. పూరీ స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇక ఈ వారమే (జూలై 5న) ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కానుండగా, అదేరోజు ఫస్ట్‌లుక్‌తో పాటే టైటిల్‍ను కూడా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే అభిమానుల ప్రచారాన్ని బట్టిచూస్తే, ఈ సినిమాకు ?రిపోర్టర్ బాలకృష్ణ? అనే పేరును ఖరారు చేశారని వినిపిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తారని, ఈ పేరైతే అన్నివిధాలా బాగుంటుందని పూరీ ఈ పేరు పెట్టారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమా టైటిల్ ఇదేనా? ఇంకేదైనా? తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే!

,  ,  ,  ,  ,  ,