Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2017 12:04:21
facebook Twitter Googleplus
Photo

నిజమే.. నందమూరి బాలకృష్ణ తన 101వ చిత్రం కోసం పూరీ జగన్నాధ్ కు అవకాశం ఇవ్వని మాట వాస్తవమే. ఈ స్టేట్మెంట్ వింటే చాలానే డౌట్స్ వస్తాయి. ఎందుకంటే.. ఇప్పటికే బాలయ్య 101వ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. అది కూడా పూరీ డైరెక్షన్ లోనే. మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా అయిపోయాక.. పూరీకి అవకాశం ఇవ్వకపోవడం ఏంటనే డౌట్స్ రావడంలో తప్పేమీ లేదు.

కానీ ఈ చిత్రాన్ని తనే నిర్మించాలని భావించాడట పూరీ జగన్నాధ్. స్టోరీ చెప్పినపుడే ఈ విషయాన్ని బాలకృష్ణకు చెప్పాడట కూడా. పలు మార్లు ఈ విషయంలో డిస్కషన్ చేసేందుకు ప్రయత్నించాడట కానీ.. బాలయ్య మాత్రం ససేమిరా అనేశారట. పెద్ద స్టార్ అయిన బాలయ్య మూవీని తనే నిర్మించాలని పూరీ కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ.. బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో ముందే ఉన్న కమిట్మెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని కుదరదని చెప్పేశారట. తన 101వ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ కు చేస్తానని ముందే మాటిచ్చారు బాలయ్య.

ఆ కమిట్మెంట్ ప్రకారమే ఇప్పుడు 101 తెరకెక్కుతుండగా.. పూరీ కోరిక నెరవేరడానికి మరికొన్నేళ్లు పట్టక తప్పదు. మరో 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి చేద్దామని.. అప్పుడు నిర్మాణం కూడా చేపట్టే ఛాన్స్ ఇస్తానని చెప్పారట బాలకృష్ణ.

,  ,  ,  ,  ,  ,  ,